Wednesday, July 2, 2025

ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఆనాటి రోజులు తిరిగి తెచ్చింది:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఆనాటి రోజులు తిరిగి తెచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు.యూరియా కోసం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలంలో రైతులు, మహిళలు బారులు తీరారని పేర్కొన్నారు. ఈ మేరకు యూరియా కోసం వందలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్న వీడియోను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

పేదల పట్ల ప్రభుత్వం కనికరం చూపకపోవడం దుర్మారం
తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు, ఆయన అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్‌లో ఇల్లు ఉండవచ్చు,

రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్‌లో ప్యాలసులు కట్టవచ్చు, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు, కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్‌లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు…పెద్ద బిల్డర్లు సిఎంకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్‌మెంట్స్ కట్టుకోవచ్చు, కానీ సిఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రాకు ఇవేవి కనబడవు అని మండిపడ్డారు. బుల్డోడర్‌రాజ్, కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్‌తో కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News