Tuesday, July 8, 2025

సవాళ్లు విసిరి పారిపోవడం రేవంత్ కు కొత్త కాదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సవాళ్లు విసిరి పారిపోవడం రేవంత్ కు కొత్త కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చురకలంటించారు. తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ మాట మీద నమ్మకం లేకనే, తాము ప్రెస్ క్లబ్ బుక్ చేసుకున్నామన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయారని, ముఖ్యమంత్రి తరపున ఎవరు వచ్చినా, తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని ఎన్నోసార్లు రేవంత్ కు చెప్పామని గుర్తు చేశారు.

రుణమాఫీ, వరికి బోనస్ చర్చకు రావాలని ఆహ్వానించామన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ వీలుకాకుంటే మరో ఎక్కడికి రమ్మని స్థలం నిర్ణయిస్తే అక్కడికి వస్తామని కెటిఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ మాట్లాడుదామంటే మైక్ కట్ చేస్తున్నారని,  అసెంబ్లీ మాట్లాడుకోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్ రెడ్డి పదవిలో నుంచి తప్పుకుంటే అభివృద్ధి అంటే ఏమిటో కెసిఆర్ చూపిస్తారన్నారు. భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్ నుంచి కెటిఆర్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు బయల్దేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  కెటిఆర్ సవాల్‌పై ఉత్కంఠ నెలకొంది.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రేవంత్ రావాలని కెటిఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.  తెలంగాణభవన్‌ నుంచి కెటిఆర్‌, బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రెస్ క్లబ్ చేరుకుంటున్నారు. రేవంత్‌కు బదులు తాము వస్తామని కాంగ్రెస్‌ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. కెటిఆర్ వెంట ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ కుమార్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News