Wednesday, August 20, 2025

వాటి ధరలు తగ్గించండి.. అప్పుడు అన్ని ధరలు తగ్గుతాయి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

గత పుష్కరకాలంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచి లక్షల కోట్ల రూపాయలను కేంద్రం ప్రజల నుంచి దోచుకుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. జిఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అని.. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుందంటూ కేంద్ర సర్కార్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. బుధవారం జిఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు ప్రతినెల వేలాది రూపాయలు పెట్రోల్, ఎల్పిజి, డీజిల్ రూపంలో భారం మోపుతూ… జీఎస్టీ స్లాబ్ మార్పు వలన కేవలం పదుల రూపాయల భారం తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ధరల తగ్గింపుపైన చిత్తశుద్ధి ఉంటే… దానికి ప్రాథమిక కారణమైన పెట్రోల్ ధరలను తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ తగ్గితే రవాణా భారం తగ్గి.. దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పిజిపైన పన్నులు తగ్గించి.. సెస్సులను పూర్తిగా ఎత్తివేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. విద్యకు సంబంధిత ఫీజులపై విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించాలి. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు, ప్రాణాలు కాపాడే జీవనావశ్యక ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి” అని కెటిఆర్ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News