రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ వేర్వేరు పార్టీ ల్లో కీలక నేతలు.. రాజకీయ శత్రువులు నిత్యం ఒకరిపై ఒకరు విమర్శ లతో మీడియాలో కని పిస్తుంటారు. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా విమర్శలకు దిగుతున్నారు. ఒకరు అయితే పరువునష్ట దావాకు కోర్టు గడప ఎక్కడానికి సిద్ధపడ్డారు.ఆ ఇద్దరు ఎవరో కాదు ఒక రు బీజేపీలో కీలక నేత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కాగా మరొకరు బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.
గురువారం నర్మాలలో వరద బాధి తులను పరామర్శించి వస్తుండగా కేంద్ర మంత్రి బం డి సంజయ్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ ఎదురుపడ్డారు.బండి సంజయ్‌ను చూ డగానే ఆయన కాన్వాయ్ వద్దకు కేటీఆర్ వచ్చారు. వాహనం దిగి కేటీఆర్ వద్దకు వచ్చిన బండి సంజయ్ అభివాదం చేశారు.బాగు న్నారా అంటూ ఒకరికొకరు పలుకరించుకున్నారు. క ష్టపడుతున్నవంటూ ఈ సందర్భంగా బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించా రు. అనంతరం నర్మాల బాధితులను ప రామర్శించేందుకు కేటీఆర్ వెళ్లిపోయారు. ఒకరినొక రు ఆత్మీయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకోవడం విశే షం.అటు బిజెపి శ్రేణులు ఇ టు గులాబీ నాయకులు ఈ సంఘటనను చూస్తూ విస్తుపోయారు.