- Advertisement -
కవిత అంశం,కాళేశ్వరం కమిషన్ నోటీసులు,
తాజా రాజకీయ పరిణామాల చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ఆయన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ భేటీ అయ్యారు. ఆదివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కెటిఆర్, తన తండ్రితో సమావేశమై పలు విషయాలు చర్చించారు. కెసిఆర్ కుమార్తె, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఇటీవల పార్టీ రజతోత్సవ సభపై తన అభిప్రాయాలు వివరిస్తూ రాసిన లేఖ, ఆ తరువాత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో కవిత అంశంతో పాటు బిఆర్‌ఎస్‌లో తాజా రాజకీయ పరిణామాలపై, కెసిఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం, రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
- Advertisement -