Friday, August 22, 2025

మూసీ దోపిడీని అడ్డుకుంటాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర భుత్వం మూసీ అభివృద్ధి కోసం అన్ని ఏ ర్పాట్లు చేసి, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే, ఇ ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ ను భారీగా పెంచి దోపిడీకి తెరలేపిందని కే టీఆర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నీళ్లను హైదరాబాద్‌కు దగ్గరలోని కొండపోచమ్మ సాగర్‌కు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అలాగే, కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేట చెరువుకు గోదావరి నీళ్లను తరలించడానికి 2022 లోనే 1,100 కోట్లతో ప్రతిపాదనకు ఆమోదం కూడా కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. మూసీ నదిలో చేరే 2000 ఎంఎల్ (మిలియన్ లీటర్స్ పర్ డే) మురుగు నీటిని శుద్ధి చేయడం కోసం మొత్తం 36 ఎస్టీపీల (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసిందీ కేసీఆర్ ప్రభుత్వమేనని కేటీఆర్ తెలిపారు. మూసీ నదిలో 5 కిలోమీటర్ల మేర నాగోల్ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టి, మూసీ నది ఒడ్డున ఉప్పల్ భగాయత్ లో శిల్పారామాన్ని ఏర్పాటు చేసిందీ గత ప్రభుత్వమేనని వివరించారు.

మూసీ అభివృద్ధి కోసం మొత్తం రంగం సిద్ధం చేసి, రూ. 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డిపిఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ ను రూ. 1,50,000 కోట్లకు పెంచి దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ప్రజాధనం దోపిడీని ముమ్మాటికీ ఎండగడుతామని, దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఢిల్లీకి మూటలు పంపుతూ తమ పదవిని కాపాడుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయ పడుతోందని, దానికి ’నగర అభివృద్ధి’ అనే అందమైన ముసుగు వేసుకుందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒక వైపు నోరు తెరిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్ధాలు చెబుతూ, మరోవైపు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీటిని తీసుకుంటామని చెప్పడం కూడా విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవైపు కాళేశ్వరంపై అబద్ధాలు చెబుతూ, మరోవైపు అదే ప్రాజెక్ట్ నుంచి నీళ్లను వాడుకుంటామనడం కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News