Saturday, July 12, 2025

బిజెపి రామచందర్ రావు భద్రాచలం భూముల కబ్జాపై నోరుమెదపరేం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

భద్రాచల రామచంద్రస్వామి దేవస్థానం భూములు ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా కావడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రామచంద్రస్వామి భూములు కబ్జా అయినా బిజెపి అధ్యక్షులు రామచందర్ రావు ఎందుకు మాట్లాడడం లేదు..? అని ప్రశ్నంచారు. 889 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా అయినా బిజెపి నుంచి ఒక్క మాట లేదని విమర్శించారు. ఈ అంశంలో మాట్లాడడానికి బిజెపి అధ్యక్షులు రామచందర్ రావుకి సమయం లేదా..లేక కేవలం రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే మౌనంగా ఉంటున్నారా..? అని నిలదీశారు. రాజకీయ పొత్తులు పక్కన పెట్టి భద్రాచల దేవస్థానం భూములను కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు. దేవస్థానం భూముల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను అమలుచేసేలా చూడాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News