మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కో టాలో ఎమ్మెల్సీలుగా నియామకమైన కోదండరామ్, అమెర్ అలీఖాన్‌ఎన్నికపై స్టే విధి స్తూ సుప్రీంకోర్టు బుధవారం సంచలన నిర్ణ యం తీసుకుంది. దీనిపై తదుపరి విచారణ ను వచ్చే నెల సెప్టెంబర్ 17కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇదే కోటా కింద గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎమ్మె ల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ప్రతిపాదించగా, అప్పటి గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. దీనిపై వారు సుప్రీంకోర్టు ఆశ్రయించగా, తమ త దుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక జ రగాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ కేసులో తమ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉండగా కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయడాన్ని తాజాగా సుప్రీంకోర్టు తప్పుపడు తూ వారి నియామకంపై స్టే విధించింది. అ లాగే గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ను ఈ కేసు విచారించిన జస్టీస్ విక్రమ్‌నాథ్, జస్టీస్ సందీప్ మెహతాల ధర్మాసనం సవరించింది.దీనిపై తదుపరి విచారణలోఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం…వివాదం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎ మ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థులుగా ప్రతిపాదించగా, అ ప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీం తో వారు హైకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024, జనవరి 13న అదే కోటా కింద ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమెర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా, కోదండరామ్, అమెర్ అలీఖాన్ నియామకాలను హైకోర్టు రద్దు చే సింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వీరిద్దరి పేర్లనే గవర్నర్‌కు పంపించగా ఆమోదించడంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆగస్టు 4, 2024వ తేదీన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. గవర్నర్ కార్యాలయం కూడా తమ వాదనను సమర్థించుకుంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒకవైపు ఇదే కేసులో తమ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉండగా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పు పడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
బీజేపీ, కాంగ్రెస్‌కు చెంపపెట్టు : కేటీఆర్
సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆయన సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించారు. గతంలో గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేసి, బీఆర్‌ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడిందని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
బీజెపీ, కాంగ్రెస్ రెండు ఢిల్లీ పార్టీలు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని కేటీఆర్ మండిపడ్డారు.బడుగు, బలహీనవర్గాలైన దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ చేసిన సిఫారసును పట్టించుకోకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ చులకనచేశారని కేటీఆర్ విమర్శించారు.
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి తన బీసీ వ్యతిరేక వైఖరిని రేవంత్ రెడ్డి చాటుకున్నాడని మండిపడ్డారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ ల చర్యలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు కేటీఆర్. దీంతో పాటే బీజేపీ, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైందన్నారు.బీఆర్‌ఎస్ నామినేట్ చేసిన బలహీనవర్గాల అభ్యర్థులకు అడ్డుతగిలి, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించిన బీజేపీ, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కిన ఈ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని సుప్రీంకోర్టు తన తీర్పుతో చాటిచెప్పిందని ఆయన కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడిన బీఆర్‌ఎస్ పక్షాన గౌరవ న్యాయవ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.