Tuesday, May 6, 2025

‘నీ ఆదాయం పెరిగింది.. తెలంగాణ ఆదాయం ఎందుకు పెరగలేదు’: సిఎంపై కెటిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీలకు రూ.250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? అని మండిపడ్డారు. నిన్ను కోసుకొని తినడం కాదు.. నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావ్… సర్కార్ నడుపుతున్నావా? సర్కస్ నడుపుతున్నావా? అంటూ రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమేనని, ఇది కాగ్ లెక్క..మీ లాగా కాకి లెక్క కాదన్నారు. చెప్పులు ఎత్తుకపోవడానికి వేరే పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారని.. ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లెక్కనే చూస్తారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్, లగ్జరీ ప్రయాణాలు అన్ని ప్రజలు చూస్తున్నారని.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నానని సిఎం అంటున్నారని, దమ్ముంటే 43 సార్లు వెళ్లిన ఢిల్లీ ప్రయాణాల ఖర్చు మీద శ్వేతపత్రం విడుదల చెయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

“ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు?. నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు. కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి లీటర్ రూ.200 చేసి సంపద పెంచాలని అనుకుంటున్నాడు, ధరలు పెంచడం కాదు.. బుర్ర పెంచు.. సంపద పెంచే ఆలోచన చేయి” అని సిఎం రేవంత్ పై కెటిఆర్ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News