మన తెలంగాణ/హైదరాబాద్ : యూరియా స మస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్, బిజెపి ఎం పీలు విఫలమయ్యారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. యూరియా కాం గ్రెస్ ఎంపీలు తేలేరు…బిజెపి ఎంపీలు అడగనే అడగరు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ, బీహార్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వడంపై మండిపడ్డారు. రైతుల కష్టాలపై దృష్టి పెట్టకుండా, రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి జాతీ య రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అ న్నారు. ఈ విషయమై కెటిఆర్ ఎక్స్ వేదికగా వ రుస ట్వీట్లు చేశారు. రైతుబిడ్డలు ఇక్కడ, రాష్ట్ర సి ఎం, మంత్రులు ఎక్కడ..? అని ప్రశ్నించారు. స మస్యలు ఇక్కడ ఉంటే, సిఎం, మంత్రులు ఢిల్లీ, బీహార్‌లోనా…?అని నిలదీశారు. రైతులు యూ రియా కోసం తండ్లాడుతుంటే, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి ఎగిరిపోతారా..? అంటూ సిఎం, మంత్రులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జాతీ య పార్టీలకు ఓట్లు, రాష్ట్ర ప్రజలకు పాట్లు అం టూ కెటిఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖ రి, జాతీయ పార్టీల నిర్లక్ష్యంపై తెలంగాణ ప్రజ లు గమనిస్తున్నారు.. ప్రశ్నిస్తున్నారని హెచ్చరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అన్నదాత అరిగోస…అడ్రస్ లేని సిఎం
- Advertisement -
- Advertisement -
- Advertisement -