హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసులపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సిఎం రేవంత్ ప్రైవేట్ సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. మంగళవారం బంజారా హిల్స్ లోని నంది నగర్ నివాసంలో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టి, దారుణంగా కొట్టారని NHRC రిపోర్ట్‌లో చెప్పారన్నారు.ప్రజలను చిత్ర హింసలు పెట్టి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డ పోలీస్ అధికారులను డిస్మిస్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని కెటిఆర్ అన్నారు.
భూసేకరణ కూడా చట్ట విరుద్ధంగా జరిగినట్లు NHRC చెప్పిందని.. దొంగచాటుగా భూసేకరణ చేయడం ఆపకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని కెటిఆర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మినిస్టర్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా లగచర్లలో పోలీసులు చేసిన దౌర్జన్యానికి బాధ్యత తీసుకొని.. సిగ్గు ఉంటే ముక్కు నేలకి రాసి.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని.. ఆయనకు ఇజ్జత్ లేదని కెటిఆర్ ధ్వజమెత్తారు.