Tuesday, July 22, 2025

ఎంబిబిఎస్ విద్యార్థినికి వైద్య దంపతులు ఆర్థిక సహాయం..అభినందనలు తెలిపిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తన జన్మదినం సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో ఎంబిబిఎస్ విద్యార్థిని సుస్మితకు వైద్య దంపతులు ఆర్థిక సహాయం అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం, వెంకటాపూర్‌కు చెందిన సుస్మిత ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదువుతున్నారు. పేద కుటుంబానికి చెందిన సుస్మిత తన చదువు కోసం ఆర్ధిక సాయం చేయాలని ఎక్స్ వేదికగా కెటిఆర్‌ను కోరారు. సుస్మిత విజ్ఞప్తికి స్పందించిన కెటిఆర్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు నిర్వహించే ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమం స్పూర్తితో ప్రసిద్ధ న్యూరో ఫిజిషియన్ డా.చంద్ర శేఖర్ పాఠకోటి, ఆయన సతీమణి డా. ప్రణయ వాణిలు సుస్మిత చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని ప్రకటించారు.

కాగా, సోమవారం వైద్య విద్యార్థిని సుస్మితకు కెటిఆర్ సమక్షంలో రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు. దుబ్బాక మండలం రాజక్కపేట చెందిన డా. చంద్రశేఖర్ ప్రస్తుతం ముషీరాబాద్ కేర్ హాస్పిటల్, నాచార్‌ంలోని శ్రీపూజా హాస్పిటల్‌లలో వైద్య సేవలందిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కెటిఆర్‌ను కలిసిన వైద్య విద్యార్థి సుస్మిత ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య దంపతులను కెటిఆర్ అభినందించి వారిని శాలువాతో సత్కరించారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా యుకె చదువుకుంటున్న గురుకుల విద్యార్థి చంద్రశేఖర్‌కు నాయిని వెంకటేశ్వరరెడ్డి రూ.లక్ష చెక్‌తోపాటు లాప్‌టాప్‌ను కెటిఆర్ సమక్షంలో అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News