Thursday, May 22, 2025

కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరంపై నోటీసులు
దూదిపింజల్ల్లా ఎగిరిపోతాయి
ఎప్పటికైనా న్యాయం, ధర్మమే
గెలుస్త్తుంది బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/నల్గొండ బ్యూరో : పా లన చేతకాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని -బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యా ఖ్యానించారు. నల్లగొండ పట్టణంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజా పాలన జరపకుండా, ప్రజా అవసరాలు తీర్చకుండా ప్ర భుత్వం కమీషన్ల పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎ న్ని నోటీసులు ఇచ్చినా అవి దూదిపింజల్లా ఎగిరిపోతాయనివ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌వి చిల్లర ప్రయత్నాలు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. క మీషన్ల కోసం ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో గల్లంతయిన కార్మికుల మృతదేహాలను మూడు నెలలైనా ప్రభుత్వం బయటకు

తీసుకురాలేకపోయిందని ఎద్దేవా చేశారు. కమీషన్లు లేనిదే ముఖ్యమంత్రి, మంత్రులు ఏ పను లు చేయడం లేదని ఆరోపించారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోందని విమర్శించారు. కమీషన్లు ఇస్తేనే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే హీనస్థితికి చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిని తట్టుకోలేక కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. నల్లగొండలో సుంకిశాల ప్రాజెక్ట్ కూలినా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్, బిజెపి కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ప్రజల సమస్యలపై కాకుండా పచ్చి నాటకంపై దృష్టి పెట్టాయని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొంటున్నారని తెలిపారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని, నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతగాని ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేస్తుంటే విచారణలు, కమీషన్ల పేరిట ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఆడపడుచులకు తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని, ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌ఎసి కోటిరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు రమావత్ రవీందర్ నాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News