Thursday, June 26, 2025

‘కుబేర’ @ 100 కోట్లు.. మెగా బ్లాక్‌బస్టర్ అంటూ పోస్ట్

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’ (Kubera Movie). ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని చేరింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా అని పేర్కొంది. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పింది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఓ నిరుపేద వాడి మధ్య జరిగే సంఘటనల ఆధారంగా కుబేరా (Kubera Movie) సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. దేవా పాత్రలో ధనుష్, దీపక్ పాత్రలో నాగార్జున ప్రేక్షకులను అలరించారు. ప్రధానంగా బిక్షగాడి పాత్రలో ధనుష్ నటనకు ప్రశసంలు అందుకుంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News