Friday, July 11, 2025

ఓటిటిలోకి ‘కుబేర’.. ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగంటే?

- Advertisement -
- Advertisement -

సెన్సిబుల్ చిత్రాలను తెరకెక్కించే టాలీవుడ్ డైరెక్ట శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘కుబేర’. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో రూపొందిన ‘కుబేర’ మూవీ.. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జులై 18 నుంచి ‘కుబేర‘ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కాగా, ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన కీలక పాత్రలో నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో ధనుష్.. దేవా అనే బిచ్చగాడిగా నటించగా.. నాగార్జన మాజీ సిబిఐ అధికారిగా నటించారు.

ఓ సీనియర్ అధికారి ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ సక్సెస్ కావడం తెలుసుకుని.. ఆ ప్రాజెక్టును దక్కించుకుని దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగాలని విలన్ భావిస్తాడు. అందుకు ఓ మినిస్టర్ తో రూ.లక్ష కోట్ల డిల్ కుదుర్చుకుంటాడు. అందులో రూ.50 వేల కోట్లు బ్లాక్ లో.. మరో సగం వైట్ లో ఇవ్వాలని మినిస్టర్ కండీషన్ పెడ్తాడు. దీని కోసం విలన్.. జైలులో ఉన్న మాజీ సిబిఐ ఆఫీసర్(నాగార్జున)ను బయటకు తీసుకొచ్చి పని అప్పగిస్తాడు. ఈ పనిని కొందరు బిచ్చగాళ్ల ద్వారా పూర్తి చేయొచ్చని మాజీ సిబిఐ ఆఫీసర్ విలన్ కు సూచిస్తాడు. అయితే, పని పూర్తైన తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ బిచ్చగాళ్లను చంపేయాలని విలన్ ప్లాన్ చేస్తాడు. అయితే, ఎంపిక చేసుకున్న బిచ్చగాళ్లలో దేవా కూడా ఉంటాడు. అతను వీరి నుంచి తప్పించుకుంటాడు. విలన్ నుంచి తప్పించుకన్న దేవా తనను ఎలా కాపాడుకున్నాడు?.. తన అకౌంట్లో పడిన వేల కోట్ల రూపాయలను ఏం చేశాడు? అనేది ఈ మూవీ స్టోరీ.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News