Monday, May 5, 2025

కుదువపడ్డ కాలం

- Advertisement -
- Advertisement -

పొదల పక్కన
దేవడు సారా కాస్తుండు
భగభగ మండే మంట మీద
బాణాలో ద్రవం మసులుతుంటే
మెల్ల మెల్లగా ఒక్కొక్క బొట్టు
సారా దిగుతుంది
దేవనికి బాగా తెలుసు సారా కాయడం
సంసారం అంటే నిప్పుల మీద కూసున్నట్టే
కడుపులో దుఃఖం రగులుతుంటే
కళ్ళ నుంచి ఒక్కొక్క బొట్టు
కన్నీళ్లు పడుతున్నాయి

బోషికుంట పక్కన…
పచ్ఛులకు ఉచ్చు లేసిండు
కుంటలో వల ఇసిరిండు
దేవనికి ఉచ్చులు, వల బాగా తెలుసు
పచ్ఛిలా చాపలా చాలాసార్లు
గిలగిలా కొట్టుకుండు

కౌలుకు తీసుకున్న భూమి
కడుపు మీద తన్నింది
ఎరుకలోకి వచ్చేసరికి
ఎద్దు మెకమైంది
ఎక్కడి దుఃఖ జెలో ఏమో
అంతరం పొంగి పొర్లుతుంది
చింతచిగురుకు చింత ఎక్కితే
చింతకు వనగాయ వంకర నవ్వు నవ్వింది
బతుకు బద్దాకయ్యింది
అన్ని పనులు వస్తే అన్నం దొరకదని
దేవనికి బాగా తెలుసు లోపల పూర్వం
దిక్కే ఉరుకుతుండు ఊరట కోసం
నీడల సాక్షిగా నిజం తెలుసు దేవనికి
తాకట్టు పడ్డ తారీకులని
పొద్దు ఎప్పటికీ ఇడిపియ్యలేదని
ఏం బీమారో ఎక్కడి బీమారో
కార్తి కండ్లల్లో పెట్టుకుంది
దరువుశెడి మంచాన పడితే
మందేది మందలిచ్చేటోడేడి
దేవనికి బాగా తెలుసు
చుట్టాలు చూసిపోతెందుకే వస్తరు
పాలోల్లు పారేసెటందుకేవస్తరని
మునాసు వెంకట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News