- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో మిస్టరీ వీడడంలేదు. 5 రోజులు గడిచినా ఇంకా నిందితుడి ఆచూకీ లభించలేదు. నిందితుడు బాలికను చంపి ఆధారాలు లేకుండా చేశాడు. బాలిక తల్లిదండ్రులు, స్థానికులతో పాటు అనుమానితులను కూకట్‌పల్లి పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సహస్ర హత్యకేసులో మహిళ ప్రమేయంపై తండ్రి కృష్ణ అనుమానం వ్యక్తం చేశాడు. బిల్డింగ్‌లోని వారే చంపారంటూ సహస్ర తండ్రి ఆరోపణలు చేస్తున్నాడు. తనపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు. తన కూతుర్ని తాను చంపితే రోడ్ల మీద పిచ్చోడిలా ఎందుకు తిరుగుతానని ప్రశ్నిస్తున్నాడు. తన కూతుర్ని చంపింది ఎవరో తనకు తెలియాలని, ఐదు రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నానని తండ్రి కృష్ణ బాధను వ్యక్తం చేశాడు.
- Advertisement -