Saturday, July 5, 2025

మమ్మల్ని కాదని బిఆర్‌ఎస్ ఫామ్‌హౌస్‌కు పోయింది: కూనంనేని

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: నంబాల కేశవరావును అమిత్ షా అన్యాయంగా చంపారని.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiva Rao) అన్నారు. మానుకోటలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలంతా కమ్యూనిస్టులు బ్రతకాలని కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. కమ్యూనిజాన్ని లేకుండా చేయడం అడాల్ఫ్ హిట్లర్ వల్లే కాలేదు.. అఫ్ట్రాల్ అమిత్ షా చేయగలరా అని ప్రశ్నించారు. సిపిఐ ఎప్పుడూ పెద్దన్న పాత్ర పోషిస్తుందని.. 1951 వరకు మేము సాయుధపోరాటం చేసామని.. పరిస్థితులను బట్టి ఆయుధాలను జమ్మిచెట్టు మీద పెట్టామని.. తీసే అవసరం రాకూడదనే కోరుకుంటున్నామని హెచ్చరించారు.

మావోయిస్టులు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని అని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అధికారం ఉన్న లేకున్నా కమ్యూనిస్టులు ప్రజలకోసం పోరాడుతారని తెలిపారు. తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని.. పాలకులను ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. పదవులు తమకు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. తమని, ప్రజల్ని కాదనుకొని బిఆర్ఎస్ ఫాంహౌస్‌కు పోయింది.. ప్రజలకు నష్టం చేస్తే రేపు కాంగ్రెస్ గతైనా అంతే అని పేర్కొన్నారు.

‘‘మావోయిస్టు అంటే మనవాడే.. సిపిఎం మనవాడే, సిపిఐ(యంయల్) మనవాడే.. ఎర్రజెండా పట్టుకున్న ప్రతివాడు మనవాడే.. కమ్యూనిస్ట్‌లను పురిటిలోనే చంపాలని చూసిన కంసుని లాంటి బూర్జువాలు, పెత్తందార్లు, కార్పొరేట్ శక్తులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. కమ్యూనిజం సజీవం.. శాశ్వతం. ఖమ్మంలో డిసెంబర్ – 26న వంద సంవత్సరాల వేడుకను లక్షలాది మందితో నిర్వహించబోతున్నాం.. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది మనిషి కోసం.. మనుషులు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది’’ అని కూనంనేని (Kunamneni Sambashiva Rao) అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News