Friday, August 29, 2025

చిరంజీవిని కలిసేందుకు.. సైకిల్‌పై వచ్చిన మహిళ అభిమాని..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్ధాల నుంచి ఆయన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. సినిమాల్లోనే కాక.. బయట కూడా ఎందరికో సహాయం చేస్తూ.. రియల్ హీరో అనిపించుకున్నారు చిరు. అయితే చిరుని కలిసేందుకు రోజు కొన్ని వేలల్లో అభిమానులు వస్తుంటారు. కానీ, అందరికి చివరికి ఒకటో, ఇద్దరికో చిరును కలిసే అదృష్టం లభిస్తుంది. ఓ మహిళ అభిమని కూడా చిరును కలుసుకొని సంతోషంగా పడ్డారు.

కర్నూలు జిల్లా ఆదోని నుంచి రాజేశ్వరి అనే మహిళ సైకిల్‌పై హైదరాబాద్ వరకూ వచ్చారు. 300 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చి చిరంజీవిని కలిశారు. చిరంజీవి (Chiranjeevi) రాజేశ్వరిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆమె చిరు చేతికి రాఖీ కట్టారు. చిరు ఆమెకు ఆర్థికసాయం చేసి.. చిరను బహుకరించారు. ఆమె పిల్లల చదువుకు పూర్తి బాధ్యత తనదే అని.. వాళ్లు ఎంతవరకూ చదువుకుంటే అంతవరకూ చదివిస్తానని హామీ ఇచ్చారు. చిరంజీవి అలా చెప్పడంతో రాజేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ మెగాస్టార్ మంచి మనస్సును మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read : సాంప్రదాయ అవతార్‌లో..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News