మోహన్‌బాబు కుమార్తెగా ఇండస్ట్రిలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి (Lakshmi Manchu).. తన నటనతో ప్రత్యేకంగా అభిమానుల్ని సంపాదంచుకుంది ఆమె. అటు నటిగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్‌గ సత్తా చాటింది. ఇక సినీ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉంటూనే మరోపాపు సామాజిక సేవలో కూడా ఆమె పాల్గొంటుంది. టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంధ సంస్థను స్థాపించి ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుంది. ఆ గవర్నమెట్ బడులను, ప్రైవేటు స్యూళ్లకు ధీటుగా తయారు చేసింది. వేలాది మంది విద్యార్థులకు స్మార్ట్ క్లాస్ విద్యను అందించింది.
అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది అని నమ్ముతుంది మంచు లక్ష్మి(Lakshmi Manchu). అందుకే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా నెల్లూరులోని కోటమిట్టలో డిజిటల్ క్లాసురూంలను లక్ష్మి ప్రారంభించింది. క్లాసును అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆ గదిలో ఓ టివిని ఏర్పాటు చేయించింది. జిల్లాలోని 12 స్కూళ్లలో రూ.2 లక్షల చొప్పున నిధులు వెచ్చించి.. టివి, తదితర సౌకర్యాలతో డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేయించింది.