Monday, July 14, 2025

బంగ్లాదేశ్ వీధుల్లో దారుణం

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో ఓ హిందూ వ్యాపారిని అత్యంత దారుణంగా హింసించి కొట్టి చంపారు. పైగా రోడ్డుపై పడి ఉన్న మృతదేహంపై ఉన్మాద రీతిలో నృత్యం చేశారు. ఈ ఘటన ఇక్కడి హిందూ సమాజంలో కలవరానికి దారితీసింది. ఢాకాలోని మిట్‌ఫోర్డ్‌లో ఈ నెల 9న ఈ దారుణం జరిగింది. తుక్కు వ్యాపారంలో ఉన్న లాల్‌చంద్ అలియాస్ సొహగ్‌పై అల్లరి మూకలు దాడికి దిగాయి. ఆయనను పట్టుకుని సిమెంటు దిమ్మెలు , రాళ్లు కర్రెలతో కొట్టారు.

చనిపోయే వరకూ కొట్టి శవమైన తరువాత కూడా తమ వికృత చర్యలకు పాల్పడ్డారు. సంబంధిత ఘటనలు సామాజిక మాధ్యమాలలో వెలుగులోకి వచ్చాయి. శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద ఎత్తున భద్రతా గాలింపు చర్యలు చేపట్టామని , సంబంధిత ఘటనకు పాల్పడ్డ వారిలో ఇప్పటికి ఏడుగురిని అరెస్టు చేసినట్లు హోం శాఖ సలహాదారుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు. ఈ హత్యోదంతాన్ని తాము శాంతిభద్రతల కోణంలో తీవ్ర విషయంగా పరిగణిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News