- Advertisement -
హైదరాబాద్: నగరంలో బోనాల జాతర సందడి నెలకొంది. ఆదివారం ఉదయం లాల్‌దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మహాకాళి అమ్మవారి ఆలయంతోపాటు పాతబస్తీలోని అన్ని ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలతో రద్దీగా మారాయి. ఇవాళ ఉదయం నుంచి మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు.. దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇక, అమ్మవారికి బోనం తీసుకొచ్చే వారికోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. బోనాల జాతర సందడి నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆలయం పరిసరాల్లో పోలీసులు, షీ టీమ్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు.
- Advertisement -