Sunday, May 25, 2025

కన్న కొడుకును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన లాలు

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఆర్‌జెడి ఆధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ని (Tej Pratap Yadav) పార్టీ నుంచి బహిస్కరిస్తున్నట్లు లాలూ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. తేజ్ ప్రతాప్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీతో పాటు తేజ్ ప్రతాప్‌ను కుటుంబం నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

తేజ్ ప్రతాప్ (Tej Pratap Yadav) ప్రవర్తన, బాధ్యతారహిత వైఖరి వల్లే తొలగిస్తున్నట్లు లాలు వెల్లడించారు. అతని ప్రవర్తన.. తమ కుటుంబా సంప్రదాయాలకు సరిపోలడం లేదని అన్నారు. ఇకపై నుంచి తేజ్ ప్రతాప్‌కు పార్టీలో కానీ, కుటుంబంలో కానీ ఎలాంటి పాత్ర ఉండదు అని పేర్కొన్నారు. అయితే శనివారం తెజ్ ప్రతాప్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆ ఫోస్టే లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ పోస్ట్‌లో తేజ్ ప్రతాప్ ఒక అమ్మాయితో క్లోజ్‌గా ఉన్నారు. ఆ అమ్మాయి పేరు అనుష్క యాదవ్ అని, గత 12 సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నట్లు తేజ్ ప్రతాప్రకటించారు. ఈ పోస్ట్‌పై దుమారం రేగడంతో పెట్టి కొంత సమాయానికే దాన్ని డిలీడ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News