Tuesday, September 9, 2025

భూమి కోసం రైతులు ఆవేదన.. వారి గోడు ఎవరు వింటారు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మిడ్జిల్: మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామానికి చెందిన గజ్జెలు జంగమ్మ ఆమె కుమారుడు కృష్ణయ్య కథ. నేటి గ్రామీణ రైతుల నిస్సహాయ స్థితిని తేటతెల్లం చేస్తోంది. సర్వే నెంబర్ 156లో 6 గుంటల భూమి తమదని చెబుతున్న వీరి భూమిని, పాలెవారు జంగయ్య తన 9 గుంటల భూమితో కలిపి 15 గుంటల భూమిని ఇతరకు విక్రయించాడని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు, వారి అనుమతి లేకుండా భూమిని దున్నడమే కాకుండా, దూషించడమన్నది రైతుల గుండెల్లో మరింత గాయాన్ని మిగిల్చింది. తమకు న్యాయం జరగాలని ఆశించి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన జంగమ్మ, కృష్ణయ్య పురుగుల మందు సీసా చేత బట్టి ఆత్మహత్యకు సిద్దపడడం పరిస్థితుల తీవ్రతను చూపిస్తుంది. సిబ్బంది సీసీ లాక్కోవడంతో ప్రమాదం తప్పినా, వారి హృదయంలో నిండిన బాధ మాత్రం అలాగే మిగిలిపోయింది.

మంగళవారం ఉదయం భూమి మొకపైకి వచ్చి పరిశీలిస్తాం అనే తహశీల్దార్ హమీ రైతులను కొంత నమ్మకం కలిగించినా, ఇప్పటి వరకు ఎన్నో ఇలాంటి హమీలు గాలిలో కలిసిపోయిన ఉదాహరణలు ఉండడం రైతుల గుండెల్లో భయం నింపుతోంది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇక్కడ న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ వద్ద గోడును వినిపిస్తాం అనే కృష్ణయ్య మాటల్లో నిరాశతో పాటు ఆవేదన కూకడా వ్యక్తమవుతోంది. రైతులకు భూమి అంటే కేవలం ఆస్తి కాదు, వారి జీవనాధారం ప్రాణధారం. ఆ ప్రాణాధారాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకే తెగించే స్థితి రావడం సమాజానికి గట్టి హెచ్చరిక. అధికారులు ఈ గోడును ఎంత సీరియస్‌గా తీసుకుంటారు? రైతు కన్నీరు ఎప్పుడు తుడుస్తారు ? భూమి వివాదాలపై స్పష్టమైన, వేగవంతమైన పరిష్కారాలు తీసుకోకపోతే… ఈ నిస్సహాయ రైతుల గోడును ఎవరు వింటారు? అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News