Wednesday, May 21, 2025

జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: వచ్చే నెల 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే పకడ్బందీగా నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం, ఘనపూర్ గ్రామం, ఎలిగేడ్ మం డలం, ముప్పిరితోట గ్రామాల్లో భూ భారతి చట్టం -2025పై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మంత్రులు డి.శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..-ప్రతి రెవె న్యూ గ్రామంలో జూన్ 2 నుంచి రెవెన్యూ నియామకం, తహసిల్దార్ నుంచి సిసిఎల్‌ఎ  వరకు ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పెద్దల చట్టం ధరణి, పేదల చట్టం భూ భారతి అని అన్నారు. ప్రతి రైతుకు భూ భద్రత కల్పించడమే లక్ష్యంగా భూ భారతి చట్టం అమలు చేస్తామని అన్నారు.

భూసర్వేకు 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లను నియమించి మూడు నెలల పాటు అవసరమైన శిక్షణ అందిస్తామని అన్నారు. మండలానికి ఆరు నుండి 8 మంది సర్వేయర్లు పనిచేయమన్నారని తెలిపారు. ఈనెల 27 నుండి సర్వేయర్లకు శిక్షణ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 256 మంది సర్వేయర్లు ఉండగా వీరి సంఖ్యను మొదటి విడతలో 1000కి పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని అన్నారు. 2020లో ధరణి చట్టం తెచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 20 వేల పైచిలుకు భూ సమస్యలు ఉండేవని తెలిపారు. చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేకపోవడం వల్ల ఎక్కడి సమస్యలు అక్కడే ఉండేవని తెలిపారు. ధరణిలో చిన్నచిన్న పొ ర పాట్లను కూడా సవరించే అవకాశం లేకపోయిందని అన్నారు. ఎంతోమంది రైతులు న్యా య స్థానాల చుట్టూ తిరిగి అలిసిపోయారని అన్నారు. భూభారతి చట్టం ద్వారా తహసీల్దార్ స్థాయి నుండి సిసిఎల్‌ఐ వరకు పరిష్కారం లభించేలా నిబంధనలు పొందుపరిచామని వివరించారు.’

10,956 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు
జూన్ 2 నుండి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి చొప్పున 10,956 గ్రామాల్లో రెవిన్యూ అధికారులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా ప్ర భుత్వ, ప్రైవేటు సరిహద్దు పంచాయతీలు కొలిక్కి వస్తాయని అన్నారు. 18 రాష్ట్రాల్లో ఆరు నెలల పాటు పర్యటించి మంచి అంశాలను క్రోడీకరించి భూభారతి చట్టం రూపొందించామని, నియమ నిబంధనలు పొందుపరిచామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు, ఎంఎల్‌ఎలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News