Friday, July 4, 2025

సోన్‌ప్రయాగ్ వద్ద విరిగిపడిన కొండచరియలు

- Advertisement -
- Advertisement -

హిమాలయ మందిరానికి వెళ్లే దారిలో సోన్‌ప్రయాగ్ సమీపంలో ముంకటియా వద్ద భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో గురువారం కేదార్‌నాథ్ తీర్థయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. కొండచరియల శిథిలాలతో రోడ్డంతా బ్లాక్ అయిపోయింది. కొండచరియలు విరిగిపడ్డ జోన్‌లో గౌరీకుండ్ నుంచి తిరిగివస్తున్న కొందరు భక్తులు చిక్కుకుపోగా, వారిని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బలగం(ఎస్‌డిఆర్‌ఎఫ్) కాపాడి, సోన్‌ప్రయాగ్‌కు సురక్షితంగా చేర్చింది. ముందస్తు చర్యలలో భాగంగా కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా ఆపేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News