Monday, August 18, 2025

లంగర్ హౌస్ లో బోల్తా పడిన వాహనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని లంగర్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం  లంగర్ హౌస్ నుంచి బండ్లగూడ వైపు లోడుతో వెళ్తున్న వాహనం సన్ సిటీ ఆర్మీ స్కూల్ వద్ద బోల్తా పడింది. దీంతో రోడ్డుపై వాహనంలోని బస్తాలు బయటపడ్డాయి. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News