కంటెయినర్ నుంచి రూ.1.85 కోట్ల విలువైన 255 ల్యాప్‌ట్యాప్‌లు మాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. కంటెయినర్ లారీ నుంచి దాదాపు 255 ల్యాప్‌ట్యాప్‌లను దుండగులు అపహరించారు. ముంబై నుంచి చెన్నైకి ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు నాలుగు కంటైనర్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద కంటెయినర్ అలారం బ్రేక్ అయినట్లు కంపెనీ ప్రతనిధులకు సమాచారం అందింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా కంటైనర్‌ను అక్కడే వదిలేసి లారీ డ్రైవర్, క్లీనర్ ఉడాయించారు. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధులు ఆదివారం మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని చీరాల డిఎస్పీ మెయి న్ తెలిపారు. చోరీకి గురైన ల్యాప్‌ట్యాప్‌ల విలువ రూ.1.85 కోట్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
బాపట్ల జిల్లాలో భారీ చోరీ..
- Advertisement -
- Advertisement -
- Advertisement -