- Advertisement -
బెల్లాజియో రిసార్ట్ అండ్ క్యాసినోలోని ల్యాండ్‌మార్క్ పౌంటెన్‌కు సమీపంలోని లాస్ వెగాస్ స్ట్రిప్‌లో ఇద్దరు వ్యక్తుల తుపాకీ కాల్పుల మరణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న అధికారులకు కాల్పుల శబ్దం వినిపించిందని, ఆపై దక్షిణ లాస్ వెగాస్ బౌలేవార్డ్‌లో ఇద్దరు వ్యక్తులు తుపాకీ గాయాలతో కనిపించారని లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ ఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు. కాల్పుల సంఘటనను ‘చెదురుమదురు ఘటన’ అని పోలీసులు అభివర్ణించారు, అనుమానితుడిని గుర్తించినట్లు తెలిపారు. ‘నిందితుడు, బాధితులు ఒకరికొకరు బాగా తెలుసునని, కాల్పులకు ముందు వారు సోషల్ మీడియా ద్వారా ఘర్షణ పడ్డారని భావిస్తున్నాం’ అని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -