Tuesday, September 9, 2025

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో (Formula E-Car Race Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని ఎసిబి ప్రభుత్వాన్ని కోరింది. ఫార్ములా ఈ-కారు రేసింగ్‌పై 2024 డిసెంబర్ 18న ఎసిబి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎ-1గా మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్, ఎ-2గా ఐఎఎస్ అరవింద్ కుమార్, ఎ-3గా బిఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కెటిఆర్‌ను రెండుసార్లు, అరవింద్‌ను మూడుసార్లు ఎసిబి ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ముగ్గురిపై ఎసిబి ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉంది.

Also Read : కాంగ్రెస్ వచ్చి 22 నెలలు గడిచినా పాలమూరుకు ఒరిగిందేమీ లేదు: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News