మనతెలంగాణ/మంథనిరూరల్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాయ్యవాద దంపతులు గట్టు వామన్‌రావ్, నాగమణిల హత్య కేసును అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించింది. హత్యకేసుకు సంబందించిన కేసును సిబిఐకి అప్పగించాలని మంగళవారం సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వామన్‌రావు స్వగ్రామం మంథని మండలంలోని గుంజపడుగ గ్రామం కాగా 17 ఫిబ్రవరి 2017లో రామగిరి మండలం కల్వచర్ల గ్రామ శివారులో న్యాయవాద దంపతులు వెళుతున్న కారును అడ్డగించి నడిరోడ్డుపై ఇరువుర్ని దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చిన సంఘటన రాష్ట్రంతో పాటు దేశంలోను సంచలనం సృష్టించింది. కేసులో పలువుర్ని అరెస్టు చేయడగా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అయితే కేసును సిబిఐకి అప్పగించాలని వామన్‌రావ్ తండ్రి కిషన్‌రావ్ సుప్రీంకొర్టును ఆశ్రయించారు.
స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఇట్టి కేసును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్‌కె సింగ్లాల ధర్మాసనం పిటిషనర్‌ను విచారించి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబందించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ అమసరమా అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసంన తెలిపింది. ఈ లోపుగా కేసును సిబిఐకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో కేసును సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగిస్తున్నట్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ విచారణలో వాస్తవాలు అన్ని వెలుగులోకి వస్తాయనే నమ్మకం తమకు ఉందని వామన్‌రావ్ తండ్రి కిషన్‌రావ్ తెలిపారు.