బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ… రాజధాని పట్నాలో పట్టపగలు జితేంద్ర కుమార్ మహతో(58) అనే న్యాయవాదిని హత్యచేశారు. పట్నా లోని సుల్తాన్ పూర్ పోలీసు స్టేషన్ లో ఈ హత్య జరిగింది. బీహార్ లో కేవలం 24 గంటల్లో తుపాకీ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం పెద్దగా ప్రాక్టీస్ లోని ఆ న్యాయవాది టీ తాగి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు మహతో పై కాల్పులు జరిపారని పట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. నేరస్తులు మహతోను కాల్పులు జరుపగానే, తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించారని, కానీ అక్కడ ఆయన మరణించారని ఎస్పీ చెప్పారు. సంఘటన స్థలం నుంచి మూడు బులెట్ షెల్స్ స్వాధీనం చేసుకుని, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
పట్నాలో న్యాయవాది కాల్పుల బారిన పడగా, బీహర్ లో వివిధ ప్రాంతాలలో 24 గంటలలో మూడు ప్రాణాంతక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. సీతామర్హి జిల్లాలో బిజీ మార్కెట్ ప్రాంతమైన మెహసల్ చోక్ వద్ద గుర్తు తెలియని దుండగులు వ్యాపారి పుతు ఖాన్ తలపై పాయింట్ – బ్లాంక్ రేజ్ లో కాల్చులు జరిపి చంపారు. అది జరిగిన కొద్ది గంటల తర్వాత
పట్నా జిల్లా షేక్ పురా గ్రామంలో పశువైద్యుడు సురేంద్ర కుమార్ (50) పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. పట్నా ఎయిమ్స్ కు తరలించినా ఆయన గాయాలతో చనిపోయాడు. పట్నాలోని రామకృష్ణ నగర్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కిరాణ దుకాణం యజమాని విక్రమ్ ఝాను కాల్చి చంపారు. గురు, శుక్రవారాలలో 24 గంటల్లో ఈ దారుణాలు జరిగాయి.