హైదరాబాద్: బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో ఓ మహిళ తన కుమారుడితో కలిసి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ పరిధిలోని వనస్థలిపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమ్మదయ కాలనీ చెందిన నోముల ఆశీష్, చింతల్ కుంటకు చెందిన సుదేష్ణను(28) నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకన్నాడు. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. మే 16న సుదేష్ణ తన బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో నాచారం వెళ్లింది. సుధేష్ణ ఇంట్లో ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో తీవ్ర మనస్థాపం చెందింది. బంగారు ఆభరణాలు పోయాయనే బాధతో కుమారుడిని తీసుకొని మూడో అంతస్థుకు చేరుకుంది. మూడో అంతస్థు నుంచి కిందకు దూకింది. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బాబు స్వల్పంగా గాయపడ్డాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
బంగారు ఆభరణాల మిస్సింగ్… భవనం పైనుంచి దూకిన మహిళ
- Advertisement -
- Advertisement -
- Advertisement -