Thursday, September 4, 2025

‘లిటిల్ హార్ట్’ హిట్ కావాలి

- Advertisement -
- Advertisement -

హీరో మౌళి తనుజ్, హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘లిటిల్ హార్ట్’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న యంగ్ హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీవాస్ మాట్లాడుతూ – లిటిల్ హార్ట్ సినిమా నచ్చి మా బ్యానర్ నుంచి ఫస్ట్ మూవీగా తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలో వంశీ నందిపాటి, హీరో మౌళి తనూజ్, హీరోయిన్ శివానీ నాగరం, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్, ఈటీవీ విన్ హెడ్ సాయి కృష్ణ, మురళీ పున్న, భాను, అనితా చౌదరి, సింజిత్ యెర్రమల్లి పాల్గొన్నారు.

Also Read :సామాన్యులకు జైఎస్‌టి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News