- Advertisement -
హైదరాబాద్: మంచిరేవుల, రాందేవ్‌గూడ ప్రాంతాలలో సంచరిస్తూ.. భయాందోళనలకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులోని ఏకో పార్కు, మిలిటరీ ఏరియాలోని టెక్‌పార్క్‌లో చిరుత ప్రవేశించినట్లు గుర్తించిన అటవీ అధికారులు.. గత 20 రోజులుగా చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చిరుత ఆచూకీ దొరక్కపోవడంతో మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ, నేక్నామ్‌పూర్, ఇబ్రహీంబాగ్‌ల గ్రామాల ప్రజలు చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని భయాందోళనలో వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిరుతను పట్టుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్ లో
చిరుత పులి బోనులో చిక్కిందని చెప్పారు. మరికొద్ది సేపట్లో చిరుతను జూ పార్కు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -