Monday, May 12, 2025

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. వినాయకుడి గుడి సమీపంలో రోడ్డు దాటుతూ కనిపించిందని ద్విచక్ర వాహనదారులు చెప్పారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకున్న అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పెద్ద పెద్దగా కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. చిరుత పాదముద్రలను పరిశీలిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘాట్ రోడ్డులో భక్తుల రాకపో కలకు అంతరాయం కలగకుండా, చిరుత అటువైపు రాకుండా ఏర్పాట్లు చేస్తామని పారెస్ట్ అధికారులు వెల్లడిం చారు. చిరుత విషయంపై భక్తు లను అధికారులుఅప్రమత్తత చేస్తున్నారు. నడకదారిలో కొండకు వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తున్నారు.

తిరుమ లలో చిరుత సంచారం తరచుగా జరుగుతూనే ఉంది. తిరుపతి నుండి తిరుమలకు వెలుతున్న రెండవ ఘాట్ లో తరచూ సంచరిస్తూ భక్తులకు కనిపిస్తోంది. చిరుత తిరుగుతుండటంతో రాత్రి వేళల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్ అధికా రులు సూచించారు. ఘాట్ రోడ్డులో భక్తుల రాకపోకల వైపు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. కాగా ఇటీవల కాలంలో తిరుమల లో క్రూరమృగాల సంచారం ఎక్కువ అయింది. అలిపిరి నడకమార్గంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చిరుతపులి, కొండ శిలువ, ఎలుబంట్లు ఇటీవల కాలంలో ఎక్కువగా సంచరిస్తున్నాయి. దీంతో భక్తులు భయపడిపోతున్నారు. గత ఘటనలను గుర్తు చేసుకుంటూ మరింత ఆందోళనకు గురవు తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News