Monday, May 19, 2025

భారత్‌లో పలు ఉగ్రదాడుల వ్యూహకర్త హతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో అనేక ఉగ్రవాద(Terrorist) దాడులకు కారణమైన లష్కరే తాయిదా సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది రజావుల్లా నిజామనీ అలియాస్ సైఫుల్లా(Saifulla) హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని సాయుధ దళాల చేతిలో అతను మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ప్రభుత్వ భద్రత కలిగిన సైఫుల్లా.. మట్లీలోని తన నివాసం నుంచి బయటకు వచ్చి.. ఓ చౌరస్తా వరకూ వెళ్లాడు. అక్కడ సాయుధదళాలు అతన్ని హతమార్చాయి. 2006లో నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడిలో సైఫుల్లా ప్రధాన సూత్రధారి. అంతేకాక.. 2001లో రాంపుర్‌లో సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై, 2005లో బెంగళూరులోని ఐఐఎస్‌సిపై జరిగిన దాడులలోనూ ఇతని ప్రమేయం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News