Wednesday, November 30, 2022

ఇక సెలవ్

- Advertisement -

Revanth

తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి,
ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా

మాజీ శాసనసభ్యుడు వేం నరేందర్‌రెడ్డి కూడా పార్టీ నుంచి నిష్క్రమణ

హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంఎల్‌ఎ పదవికి ఎ.రేవంత్ రెడ్డి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు టిడిపి జాతీయ కార్యదర్శి టిడి జానార్దన్‌కు విజయవాడలో తన రాజీనామా లేఖలను అందజేశారు. దీంతో పాటుగా చంద్రబాబును ఉద్దేశించి రాసిన లేఖను కూడా సమర్పించారు.ఎంఎల్‌ఎ పదవికి చేసిన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్‌లో రాశారు. అయితే, దానిని ఇంకా స్పీకర్‌కు పంపలేదని సమాచారం. రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఎంఎల్‌ఎ వేం నరేందర్‌రెడ్డి కూడా టిడిపికి రాజీనామా చేశారు. అంతకుముందు విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో టిడిపి జాతీయ అధ్యక్షులు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన తెలంగాణ టిడిపి నేతల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ భేటీలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, ఉమా మాధవరెడ్డి, గరికపాటి రామ్మోహన్‌రావు, పెద్దిరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు

కార్యకర్తలు చెప్పినట్టే భవిష్యత్తు కార్యాచరణ : రేవంత్‌రెడ్డి

హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తొలుత దేశ, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై గంటపాటు చర్చించారు. బిజెపి అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్భంగా చంద్రబాబు తప్పుపట్టినట్లు సమాచారం. అనంతరం తాను మీడియా సమావేశంలో మాట్లాడి మళ్ళీ వస్తానని, ఈలోపు భోజనం చేయాలని చంద్రబాబు తెలంగాణ నేతలకు సూచించారు. చంద్రబాబు కుర్చీలో నుంచి లేస్తూ రేవంత్‌తో పాటు ఐదుగురు ముఖ్య నేతలతో లంచ్ తరువాత విడిగా భేటీ అవుతానని, ఎవరెవరు వస్తారో నిర్ణయించుకోండి అని చెప్పారు. వెంటనే రేవంత్ ఆయన దగ్గరకు వెళ్ళి ‘సార్ నేను పార్టీలో కొనసాగలేను. నేను వెళ్తున్నాను’ అని చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు ఉండు మాట్లాడుకుందామన్నారు. రేవంత్ నమస్కారం పెట్టి భావోద్వేగంతో సార్ వెళ్లొస్తాను.. మీ ఆశీస్సులు కావాలని చెప్పి అక్కడి నుండి నిష్క్రమించినట్లు టిడిపి నేతలు తెలిపారు. అనంతరం విజయవాడ నుండి బయలుదేరి నేరుగా కొడంగల్‌కు చేరుకున్నారు. చంద్రబాబుతో జరిగిన తెలంగాణ టిడిపి నేతల భేటీలో అరవింద్ కూమార్ గౌడ్, బత్తిని నర్సింహులు, కొత్తకోట దయాకర్ రెడ్డి, బుచ్చిలింగం, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, బండ్రు శోభారాణి, ఈగ మల్లేశం, వీరేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
ఇందుకే రాజీనామా : తాను పార్టీని వీడుతున్నందుకు కారణాలను తెలియజేస్తూ చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.టిడిపిలో తన ఎదుగుదలకు చంద్రబాబు ఎలా సహకరించారో అందులో పేర్కొన్నారు. రేవంత్ లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి“ మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు నాకు గొప్ప అనుభవాన్నిచ్చాయి. సుదీర్ఘ రాజకీయాలు, పాలన అనుభవం ఉన్న మీతో ప్రయాణం మరచిపోలేనిది. మీ సారథ్యంలో అనేక ప్రజా పోరాటాల్లో భాగస్వామి కావడం నా అదృష్టం. మీ అనుచరుడిగా, టిడిపి నేతగా గుర్తింపు పొందడం నేను గర్వించే విషయం. టిడిపిలో చేరిన నాటి నుంచి మీ నిర్ణయాలకు కంకణబద్ధుడినై పనిచేశాను. పార్టీలో తక్కువ సమయంలోనే నాకు గుర్తింపు దక్కింది. పేదల బాగు కోసం అన్న ఎన్‌టిఆర్ తపించిన విధానం నాకు స్ఫూర్తి. టిడిపితో బంధం తెంచుకోవడం నాకు గుండె కోతతో సమానం. సిఎం కెసిఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజన రైతులకు బేడీలు వేసి ఆత్మగౌరవం దెబ్బతీసింది. మల్లన్న సాగర్‌ను రావణకాష్టంగా మార్చింది. నేరెళ్లలో దళితులు, బీసీలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది. భూపాలపల్లిలో గుత్తికోయలను చెట్లకు కట్టేసి కొట్టారు. ప్రతిపక్షాల ఉనికిని కెసిఆర్ సహించలేకపోతున్నారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కడం, అసెంబ్లీలో సస్పెన్షన్లు నిత్యకృత్యమయ్యాయి. నాపై కక్షగట్టి అక్రమ కేసుల్లో ఇరికించిన విషయం మీకు తెలుసు. జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు. నా బిడ్డ నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు మాత్రమే కోర్టు నాకు అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో మీరు, నాకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు. కేసీఆర్ కుటుం బం చేతిలో తెలంగాణ బందీ అయింది. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజా సంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది. తెలంగాణ సమాజం ఏకతాటిపై ఉండి కేసీఆర్‌పై పోరాడాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణ సమాజ హితం కోసం నేను ఉద్ధృతంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. తెలంగాణ హితం కోసం విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నా ను. నా నిర్ణయాన్ని ఆ కోణంలోనే చూడండి. నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles