Saturday, May 17, 2025

రొటీన్‌గా సాగిన ఇన్వెస్టిగెటివ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

నవీన్‌చంద్ర హీరోగా లోకేశ్ అజల్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెవెన్’. (Leven)అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ ఇన్వెస్టిగెటివ్ థ్రిల్లర్ శుక్రవారం విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సినిమా కథః అరవింద్ (నవీన్ చంద్ర) విశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తుంటాడు. విశాఖలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ కేసుల్ని డీల్ చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దాంతో ఆ డ్యూటీ అరవింద్ తీసుకుంటాడు. అయినా సరే, హత్యలు కొనసాగుతూనే ఉంటాయి. హంతకుడే కాదు.. హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎక్కడా దొరకవు. ఆరో మరణం దగ్గర ఓ చిన్న ఆధారం దొరుకుతుంది. దానిని బట్టి కేసులో కదలిక వస్తుంది. హత్యకు గురైన వాళ్లు ఎవరో ఒక్కొక్కరుగా తెలుస్తుంటారు. హత్యలు చేసేది ఎవరనేది మాత్రం తెలియదు. మరి అరవింద్ ఆ హంతుకుడిని పట్టుకున్నాడా? ట్విన్ బర్డ్ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి? ఈ కథలో బెంజిమన్ పాల్,

ఫ్రాన్సిస్ ఎవరు? అన్నది కథ.
విశ్లేషణః ఈ చిత్రంలో మంచి పాయింట్ ఉన్నప్పటికీ కథనం మాత్రం మెల్లిగా సాగుతుంది. ప్రధానంగా ఫస్టాఫ్‌ని బాగా సాగదీసినట్టుగా అ నిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం వేగంగా డిజైన్ చేసి ఉంటే ఈ థ్రిల్లర్ ఆకట్టుకునేది. అలాగే నవీన్ చంద్ర రోల్‌ని కూడా ఇంకొంచెం బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ఇంకొన్ని థ్రిల్ మూమెంట్స్ సహా ట్విస్ట్‌లు కూడా జత చేస్తే ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించే ది. ఈ తరహా కథలు తెరపై కోకొల్లలుగా వచ్చా యి. మొదటి 20 నిమిషాల కథ, తెరపై చూపించిన విధానం కూడా పాతగానే ఉంటుంది. దర్శకుడు క్రైమ్ సీన్స్‌లో ప్రేక్షకుడిని పూర్తిగా లీనం చేయలేకపోయాడు. అయితే వాటిపై ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. హీరో నవీన్‌కు, హీరోయిన్ రేయాకు మధ్య లవ్ డ్రామా బలవంతంగా పెట్టిన భావన కలుగుతుంది. ఈ మధ్యకాలంలో నవీన్ చంద్ర సీరియస్ రోల్స్‌లోనే ఎ క్కువగా కనిపిస్తున్నారు. అందులోనూ ఎక్కువ పోలీస్ పాత్రలే. ఈ సినిమా కూడా రొటీన్‌గానే సాగింది. దర్శకుడు క్రైమ్ సీన్స్‌ని, ఇన్వెస్టిగేషన్‌ని ఇంకాస్త బాగా చూపించి ఉంటే ఈ సినిమా మంచి థ్రిల్లర్‌గా నిలిచేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News