బెంగళూరు: లెక్సస్ ఇండియా ఇవాళ చాలా కీలకమైన ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం… తమ మొత్తం ఉత్పత్తుల రేంజ్ లో ధరల తగ్గింపును ప్రకటించింది. ఇటీవలే కేంద్రం ప్రభుత్వం GST రేట్లను సవరించడంతో… వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలను తమ గెస్ట్ లకే పూర్తిగా అందించబోతోంది లెక్సస్ ఇండియా. ఇలా గెస్ట్ లకే ప్రయోజనాల్ని అందించడం ద్వారా లెక్సస్.. గెస్ట్ ల పట్ల తమకున్న దృఢమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది. అదే సమయంలో లగ్జరీ మొబిలిటీకి ప్రాప్యతను మరింత పెంచుతుంది. సవరించిన ధరలు 22 సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వస్తాయి.
ఈ ప్రకటన సందర్భంగా.. లెక్సస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ హికారు ఇకేయుచి గారు మాట్లాడుతూ, “ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న మా విలువైన గెస్ట్ లకు GST రేటు తగ్గింపు యొక్క పూర్తి ప్రయోజనాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము. దీనివల్ల గెస్ట్ లతో మాకు మరింత యాక్సెసిబిలిటీ పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. లగ్జరీ మొబిలిటీ స్పేస్ లో గెస్ట్ లకు మామీద మరింత విశ్వాసం పెరుగుతుంది. ఈ పండుగ సీజన్ ప్రారంభంలో వస్తున్న ఈ రేటు తగ్గింపు ప్రయోజనం… ఆనందాన్ని అందిస్తుంది. మా అతిథులు లెక్సస్ శ్రేణి వాహనాలను అనుభవించడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది అని అన్నారు.
లెక్సస్లో, ప్రతి నిర్ణయం ఓమోటేనాషి స్ఫూర్తితో మార్గనిర్దేశం చేయబడుతుంది. నిజంగా అర్థవంతమైన అనుభవాలను అందిస్తూనే మా గెస్ట్ ల అవసరాలను తీర్చే అద్భుతమైన మరియు ప్రత్యేక విధానం ఇది. ఈ ప్రయోజనాలను పూర్తిగా విస్తరించడం ద్వారా, మేము ఈ సంస్కరణను మరింత ఆనందంగా జరుపుకుంటాము. అంతేకాకుండా లెక్సస్ యాజమాన్యాన్ని చిరస్మరణీయంగా మరియు లోతుగా వ్యక్తిగతంగా మార్చాలనే మా వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాము.