Friday, July 11, 2025

శ్రీశైలం 3 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కృష్ణ బేసిన్ కు వరద ప్రవాహం యధావిధిగా కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి 1,62 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన ఉన్న జూరాల12 సుంకేసుల ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం కు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం కు లక్ష అరవై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి దిగువ నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైపుకు 81 వేల క్యూసెక్కులు కుడి ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 67 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండడంతో నాగార్జునసాగర్ కు మొత్తం 1లక్ష 48 వేల క్యూసెక్కుల నీటిని వదులు తున్నారు. ఎగువ కర్ణాటక మహారాష్ట్ర ను కురుస్తున్న వర్షాలకు జూరాల ఎగువన ఉన్న అలమట్టి నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో సాగుతుంది.

నారాయణపురం డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు ఒక లక్ష పదివేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నడంతో 12 గేట్ల ఎత్తి శ్రీశైలం వైపుకు వెళుతున్నారు. జూరాలలో ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అనంతరం మరో 29వేల కేశకులను వదులుతున్నారు. సుంకేసుల బ్యారేజ్ కి ఎక్కువ తుంగభద్ర నది నుంచి 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 13 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం వైపుకు 52 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 కి శక్తుల నీరు ఎత్తిపోస్తుండగా… రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 20వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

శ్రీశైలంలో 202 టిఎంసిలు
శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202 టిఎంసిల మేర నీరు నిలువ ఉంది. అడుగులలో 885 అడుగులకు గాను 882.70 అడుగులలో నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో ఇంతే స్థాయిలో నీటిని నిలువ ఉంచుతూ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లు తెరుస్తూ మూస్తూ వస్తున్నారు. గురువారం మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే మోతాదులో కృష్ణా బేసిన్ కు వరద కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News