Tuesday, July 15, 2025

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నందున సిఎం ఆమో దం లేకుండా బదిలీలు చేయవద్దని ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఆ ర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సు ల్తానియా జీఓ నెంబర్ 114 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఆగస్టు 1 నుండి రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమలులోకి వ చ్చిందని, అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే మి నహాయింపు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులను బదిలీ చేయకుండా ఖాళీగా ఉన్న పోస్టులకే పదోన్నతులపై ఉద్యోగులను ని యమించాలని సూచించింది. పదవుల రద్దు, హే తుబద్ధీకరణ, తిరిగి పంపే విధానాలు, విదేశీ సేవలపై డిప్యూటేషన్‌లు, క్రమశిక్షణ చర్యలు వంటి సందర్భాల్లో కూడా ఇతర ఉద్యోగులను బదిలీ చే

యకుండా ఖాళీ పోస్టుల్లోనే నియామకాలు జరగాలని పేర్కొంది. ఆరు నెలలకన్నా ఎక్కువ సెలవుల తర్వాత ఉద్యోగంలో చేరినవారు కూడా ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే నియమించబడాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు గరిష్టంగా ఆరు నెలల వరకూ పొందే వార్షిక సెలవుల స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయరాదని తెలిపింది. కొన్ని శాఖలు ప్రభుత్వం విధించిన బదిలీ నిషేధాన్ని వి స్మరించి ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, గతంలో అమలులో ఉన్న జీఓల ఆ ధారంగా బదిలీలు చేస్తున్నందున అవి ఇక వర్తిం చవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన తరువాత ప్రభుత్వం అన్ని శాఖల్లో జీఓల్లో పేర్కొన్న మినహాయింపులు అని స్పష్టం చేస్తూ కఠినంగా పాటించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News