- Advertisement -
బ్యాంకాక్: థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో జూకీపర్‌ను సింహాలు చంపి పీక్కుతిన్నాయి. బ్యాంకాక్‌లో ఓపెన్ ఎయిర్ జూలో జియన్ రంగ ఖరాసమీ అనే వ్యక్తి 20 ఏళ్లుగా సింహాల కేర్‌కేటర్‌గా పని చేస్తున్నారు. జియన్ రంగపై సింహాలు దాడి చేసి పీక్కుతిన్నాయి. వాహనాల హారన్లు కొడుతూ, గట్టి గట్టిగా అరిచిన 15 నిమిషాలకు పైగా అతనిపై సింహాలు దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి సింహాలు పీక్కుతిన్నాయి. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Advertisement -