హీరో మౌళి తనుజ్, హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ లిటిల్ హార్ట్. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శివానీ నాగరం మీడియాతో మాట్లాడుతూ “లిటిల్ హార్ట్ సినిమా పూర్తిగా లైట్ హార్టెడ్ మూవీ. కాలేజ్ డేస్‌లో ఉండే ఫన్‌తో సాగుతుంది. లవ్ స్టోరీ ఉన్నా, అందులో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉండవు.- ఈ సినిమాలో కాత్యాయని అనే క్యారెక్టర్‌లో నటించాను. ఈ పాత్ర ప్రేక్షకులు తమతో తాము పోల్చుకునేలా ఉంటుంది. అఖిల్, కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే అందరికీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. ‘లిటిల్ హార్ట్’లో మంచి ఫన్ ఉన్న నవ్వించే క్యారెక్టర్ దొరికింది. నెక్స్ సుహాస్‌తో హే భగవాన్ అనే మూవీలో నటిస్తున్నా. ఇదొక పూర్తిగా హిలేరియస్ ఎంటర్‌టైనర్. షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి”అని అన్నారు.
Also Read: అలా ఎందుకు చేస్తారని బాధపడుతుంటా:కృతి సనన్