Wednesday, August 20, 2025

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ‘లిటిల్ హార్ట్’ టీజర్..

- Advertisement -
- Advertisement -

‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “సినిమా టీజర్ నాకు బాగా నచ్చింది. ఈ కామెడీ మూవీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ లో నవ్వించడంలో ఎక్కడా ఫెయిల్ కాదు. ఇంటర్ చదివిన పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమిది”అని తెలిపారు. డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. “2 గంటల 3 నిమిషాల సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు” అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, ఈటీవీ విన్ ప్రతినిధి నితిన్, హీరో మౌళి తనూజ్, హీరోయిన్ శివానీ నాగరం, నటుడు రాజీవ్ కనకాల, సింజిత్ యెర్రమల్లి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News