Sunday, August 31, 2025

‘లిటిల్ హార్ట్స్’ ట్రైలర్ విడుదల.. ఆద్యంతం నవ్వులే..

- Advertisement -
- Advertisement -

సోషల్‌మీడియాలో కంటెంట్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు మౌలి. ఆ తర్వాత ‘#90’S’ సిరీస్‌తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇప్పుడు మౌలి నటిస్తున్న తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts). ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా ఫేమ్ శివానీ నాగారం ఈ సినిమాలో హీరోయిన్. ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఈ స్టోరీ జియో సిమ్ రాక ముందు జరిగింది’ అంటూ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

ఆ తర్వాత హీరోయిన్ ‘నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా’ అని అడగగా.. మౌలి.. ‘నాకు గ్రహాంతరవాసులైనా ఓకే’ అని చెప్పే డైలాగ్‌తో నవ్వులు మొదలవుతాయి. ఇలా ట్రైలర్ (Little Hearts) మొత్తం యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకొనే సన్నివేశాలు, డైలాగ్స్‌తో నింపేశారు. ఇక ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా.. ఆదిత్య హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సిన్‌జిత్ యర్రమల్లి సంగీతం అందించారు.

ట్రైలర్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read : సరదాగా సాగే ‘బూమ్ బూమ్..’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News