Friday, May 23, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి గురువారం స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తుంది. సుంకేసుల బ్యారేజ్ నుంచి 8 వేల 690 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఆంద్రి నుంచి 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగుతుంది. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రాలలో వర్షాలు కురుస్తుండడంతో స్వల్పంగా జలాశయాలలో వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 817.20 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 38.8000 టిఎంసీల మేర నైఈరు నిల్వ ఉంది. గురువారం రాత్రి వరకు సుంకేసుల బ్యారేజ్‌కు 10వేల 900 క్యూసెక్కుల ఎగువ నుంచి వరద వస్తుండడంతో రెండు గేట్లను ఒక మీటర్ చొప్పున ఎత్తి దిగువ శ్రీశైలంకు నీటిని వదులుతున్నారు. అదే విధంగా శ్రీశైలం తిరుగు జలాలపై ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1305 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది మొదటిసారిగా ఇన్‌ఫ్లో ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News