- ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు
- వచ్చే నెల మొదటివారంలో నోటిఫికేషన్ జారీ
- రెండు దశల్లో ఎన్నికలకు సిద్ధం కావాలని ఇసికి సమాచారం?
- ఓటర్ల ముసాయిదా జాబితాల ప్రదర్శనతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం
మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎన్నికల్లో కీలకమైన బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడంతో ఆ దిశగా రిజర్వేషన్ల అమలుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. జనాభా ఆధారంగా బిసిలకు ఎక్కడెక్కడ రిజర్వేషన్లు అమలవుతాయి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపైనా స్పష్టత ఇచ్చే పనిలో పంచాయతీరాజ్ శాఖ నిమగ్నమైంది. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌లు కీలకమైనందున గ్రామాల్లో పోటీ చేసేందుకు ఆరాటపడుతున్న నేతలంతా రిజర్వేషన్‌లు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. గత స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ మొ దటి వారంలో ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌లు, ఎ న్నికలకు అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యా లెట్ పేపర్ల ముద్రణ వంటి అంశాలు మరో నాలుగైదు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటిని పరిశీలించిన వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. ముందుగా ఎంపీటీసీ ఎన్నిక లు, ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభు త్వం భావించింది. అయితే ఎన్నికలు మరింత ఆలస్యం కావడంతో ముందు పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాతే పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల నిర్వహణ, టి-పోల్ యాప్, ఇతర ఎన్నికల మాడ్యూళ్లపై మండల స్థా యి అధికారులకు ఆన్‌లైన్‌లో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
ఓటరు ముసాయిదా జాబితాల ప్రదర్శనతో ప్రారంభమైన హడావుడి
గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ఓ టరు ముసాయిదా జాబితాలను ప్రదర్శించడంతో ఆశావాహులతో పాటు ప్రజల్లో ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. గ్రామ పంచాయతీల పాలక వర్గాలు 2024 ఫిబ్రవరి మొ దటి వారంలో ముగియగా, మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం గత ఏడాది జూన్, జులై మాసాల్లో ముగిసింది. ఈ ఎన్నికలను సకాలంలో నిర్వహించని కా రణంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, పారిశు ధ్యం లోపిస్తోందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలన నడుస్తు న్నప్పటికీ, స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సం ఘం నిధులను నిలిపి వేయడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.
ఆశావహుల సంఖ్య భారీగా ఉండే అవకాశం
ఓటర్ల తుది జాబితా ప్రకటించిన వారం రోజుల్లోనే పం చాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం కనబడుతుండడంతో ఎన్నికల్లో పోటీ చేసే వార్డు స్థాయి నాయకుల నుంచి సర్పంచ్ పదవి ఆశించే వారి వరకు ఆ శావహుల సంఖ్య భారీగా ఉంటుందని సమాచారం. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతున్నా పోటీ చేసే వారి సంఖ్య గతంలో కంటే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారా అని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ, తదితర పార్టీలకు చెందిన నాయకులు, తటస్తులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది త యారు చేసిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడిం గ్ అధికారులతో సహా పోలింగ్ సిబ్బంది డేటాను అప్‌డే ట్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులను ఆదేశించింది. వారి వారి జిల్లాల్లో అవసరమైన పోలీసు సిబ్బందికి సంబంధించిన స్పష్టమైన నివేదికలను కూడా సమర్పించాలని వారు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపిటిసి, 566 ఎంపిపి, 566 జడ్‌పిటిసి, 31 జిల్లా పరిషత్ స్థానాలతో సహా పోటీ చేయాల్సిన తుది స్థానాల సంఖ్యపై పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 12,778 గ్రామ పంచాయతీల్లో 1,12,694 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందిస్తోంది.