Tuesday, May 6, 2025

పంచాయతీ ఆలస్యం!

- Advertisement -
- Advertisement -

బిసి రిజర్వేషన్ల చట్టబద్ధత ఇప్పట్లో
అయ్యేనా? కేంద్ర ప్రభుత్వం
నుంచి ఇప్పటికీ రాని స్పష్టత
కులపరమైన జనగణన పూర్తి చేసిన
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో
రిజర్వేషన్లకు పూర్తి స్థాయిలో
కసరత్తు ఎన్నికలకు సన్నాహాలు
చేసిన యంత్రాంగం స్థానిక
పోరు కోసం ఎదురు చూస్తున్న
పంచాయతీలు, మున్సిపాలిటీలు’

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొంత ఆలస్యం అ య్యేఅవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటి కే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. కులగణన త ర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా కులగణన పూర్తిచేసి వెనుకబడినతరగతులు(బిసి)ల జనాభా 56 శాతం ఉన్నట్లు ని ర్ధారించింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు స్థానిక సం స్థల్లో కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలను కూడా చేసింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు చట్టబద్ధ్దత కల్పించేందుకు పార్లమెంటు ఆమోదించాల్సి ఉం ది.

అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా జనగణన సమయంలో కులగణన కూడా నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశంపై సందిగ్ధ్దత  నెలకొంది. వాస్తవానికి కేంద్రం జనగణన 2027 తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. కేంద్రం నిర్వహించే జనాభా లెక్కల్లో కులగణన నిర్వహించడం ద్వారా దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి ఇతర కులాలు, మతాల వారీగా లెక్కలు అధికారికంగా వెల్లడికానున్నాయి. ఇదంతా జరిగేందుకు కనీసం రెండు సంవత్సరాల కాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ మరో రెండేళ్ళ పాటు నిలిపివేసే పరిస్థితి ఏమాత్రం ఉండదు. అందుకు కారణం స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అంటకం కలుగుతుంది.

ఐదేండ్లకోసారి ఎన్నికలు
రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఐదేండ్ల కోసారి తప్పనిసరిగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దతను కల్పించింది. రిజర్వేషన్లను ఐదేండ్లకోసారి మార్చే సవరణకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణలో అనేక మార్పులు కూడా చేశారు. ఒక మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండే విధంగా మార్పు చేశారు. 80 గ్రామాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు. ఇలా ఎన్నికలకు చట్ట పరంగా చేయవలసిన ఏర్పాట్లన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వేగానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాను, పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేసి ఎన్నికలకు అవసరమైన సన్నాహాలు పూర్తిచేసింది.

రాష్ట్రంలో 1.99కోట్ల ఓటర్లు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.99 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 12,845 గ్రామ పంచాయతీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News