న్యూఢిల్లీ : పార్లమెంట్ లో ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యలు ఆందోళనకు దిగడంతో వాయిదా పడ్డాయి. ఎపికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపిలు లోక్‌సభను స్తంభింపచేశారు. బుధవారం ఉదయం లోక్ సభ ప్రారంభమైన వెంటనే ఎంపిల ఆందోళనతో వాయిదా పడింది. ఎనిమిదో రోజు తెలంగాణకు చెందిన టిఆర్ఎస్ ఎంపిలు రిజర్వేషన్లు కోసం పోరాటం ఉధృతం చేశారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ ఎంపిలు సభలో నినాదాలు చేస్తూ.. పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.